Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలియానా నాకు మంచి స్నేహితురాలు .. రెజీనా 'అమ్మా' అని పిలుస్తుంది: నటి ప్రగతి

  • ఇలియానాతో వరుస సినిమాలు చేశాను 
  • మా మధ్య పరిచయం పెరిగింది  
  • రెజీనా మా ఇంటికి వస్తుంటుంది
కేరక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇలియానాతో తనకి గల స్నేహం గురించి ప్రస్తావించారు. "నేను .. ఇలియానా కలిసి ఒక ఐదారు సినిమాలు చేశాము. వరుస సినిమాలను కలిసి చేయడం వలన మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య లాంగ్వేజ్ ప్రోబ్లం లేకపోవడంతో ఆ పరిచయం స్నేహంగా మారడానికి పెద్దగా సమయం పట్టలేదు.

షూటింగు అయిన తరువాత ఇలియానా కారు పంపించేది. షాపింగ్ కి .. స్విమ్మింగ్ కి .. జిమ్ కి .. డిన్నర్ కి ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఇక రెజీనా కూడా నాకు బాగా కనెక్ట్ అయింది .. నన్ను 'అమ్మా' అని పిలుస్తుంది. హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి వస్తుంది .. రెండు రోజులైనా నాతో స్పెండ్ చేస్తుంది" అని చెప్పుకొచ్చారు.    
pragathi'ali

More Telugu News